గొల్లపాలెంలో గ్రామ గ్రామాన జనసేన-టిడిపిల గ్రామస్థాయి సమావేశాలు

రాజోలు నియోజకవర్గం: గ్రామ గ్రామాన జనసేన- తెలుగుదేశం పార్టీల గ్రామస్థాయి సమావేశాల్లో భాగంగా శుక్రవారం మల్కిపురం మండలం, గొల్లపాలెం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు తుపాటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త గుండుబోగుల పెదకాపు, రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రమేష్ బాబు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దిరిశాల బాలాజీ, జనసేన నాయకులు పినిశెట్టి బుజ్జి, జిల్లా కార్యదర్శి గుండా బత్తుల తాతాజీ, సఖినేటిపల్లి మండల అధ్యక్షులు గుబ్బల ఫణికుమార్, ఉండపల్లి అంజి, రేకపల్లి భాస్కర్, మలికిపురం మండల ప్రధాన కార్యదర్శి నల్లి పవన్ ప్రసాద్ జనసేన పార్టీ & తెలుగుదేశం పార్టీల ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, జనసైనికులు క్రియా వాలంటీర్లు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.