పల్లె పధాన జనసేన

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, కంచికచర్ల మండలంలోని కంచికచర్ల పట్టణం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ అకాలమరణం చెందడంతో, దేవినేని ఉమామహేశ్వరావు కుటుంబాన్ని వారి స్వగృహం నందు పరామర్శించి, చంద్రశేఖర్ భౌతికఖాయానికి నివాళులు అర్పించారు. సాయంత్రం పల్లె పధాన జనసేన కార్యక్రమంలో భాగంగా నందిగామ నియోజకవర్గం, వీరులపాడు మండలం, నందలూరు, తాటిగుమ్మి గ్రామాల్లో నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పర్యటించడం జరిగింది. పర్యటనలో జనసైనికులు భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. గ్రామ పుర వీధుల్లో తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలు రమాదేవి దృష్టికి తీసుకోచ్చారు. ఈ సందర్బంగా రమాదేవి మాట్లాడుతూ కుంటుపడిన అభివృద్ధి గురించి ప్రజలతో చర్చించన్నారు. తదుపరి స్థానిక సమస్యలపైన సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం తాటిగుమ్మి గ్రామంలో రమాదేవి అడుగుపెడుతుండగానే జై జనసేన అంటూ జనసైనికులు బైక్ ర్యాలీ నడుమ నినాదలతో హోరేత్తించారు. తాటిగుమ్మి గ్రామంలో మాట్లాడుతూ స్థానికంగా గ్రామంలో విద్యుత్ లైన్లు గ్రామ నడిబొడ్డు నుంచి వేయడం వలన పలువురు విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారని అక్కడి నుంచి తొలగించి జనావాసాల నుంచి తొలగించాలని అలాగే బీసీ కాలనీలో ఉన్న మంచినీటి బావులను మరమ్మతులు చేయించాలని రమాదేవి ముందు తెలిపారు. ఇవే కాకుండా గ్రామానికి వెళ్లి వచ్చే రోడ్లు నరకప్రాయంగా ఉన్నాయని గర్భిణీ స్త్రీలు మార్గమధ్యంలోనే డెలివరీలో అవుతున్నాయని ఇంతటి దుర్మార్గమైనటువంటి పాలనను ఎప్పుడూ చూడలేదని ప్రజలు కన్నీటి పర్యంతరమయ్యారని త్వరలోనే వీటన్నిటికీ ముగింపు తీసుకొస్తానని రమాదేవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరులపాడు మండల అధ్యక్షులు బేతపూడి జయరాజు, నందిగామ మండల అధ్యక్షులు కూడుపుగంటి రామారావు, తాటిగుమ్మి, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు ఊపెల్లి ఆనంద్, నందలూరు గ్రామ అధ్యక్షులు జూపూడి చిరంజీవి, పట్టణ ప్రధాన కార్యదర్శి తెప్పలి కోటేశ్వరరావు, సూర సత్యన్నారాయణ, పురంశెట్టి నాగేంద్ర, జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.