కంచల గ్రామంలో పల్లె పధాన జనసేన

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, నందిగామ మండలం కంచల గ్రామంలో పల్లె పధాన జనసేన కార్యక్రమంలో నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి పాల్గొన్నారు. రమాదేవి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంచల గ్రామ ప్రజలు స్థానిక సమస్యలను రమాదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ ఈ కంచల గ్రామంలో పర్యటిస్తున్నపుడు ఎన్నో సమస్యలు ప్రజలు తన దృష్టికి తీసుకు వచ్చారని, పాత కంచల గ్రామంలో సిసి రోడ్లపై కొన్ని చోట్ల డ్రైనేజీ పారుతోందని, ఇక్కడి ప్రజలు ఎలా జీవిస్తున్నారో తనకు అర్థం కావడంలేదని, దీని వలన దోమలు, ఈగలు వ్యాప్తి చెంది ఇక్కడి ప్రజలు అనారోగ్యం పాలు అవుతున్నారని, కొత్త కంచల యసి.కాలనీలో అంతర్గత డ్రైనేజీ సరిగా లేదని, దీని వలన ఎంతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కంచల గ్రామంలో పర్యటిస్తున్న సమయంలో గ్రామ వాలంటీర్ ఒకరు నాతో మాట్లాడారనీ, అతను అవగాహన లోపంతో పొత్తుకు, విలీనంకి వ్యత్యాసం తెలియక మాట్లాడారని, అందుకు సభాముఖంగా నేను ఒకటే చెబుతున్నాను జనసేన టిడిపి పొత్తులో ఉంది విలీనం కాలేదు అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఇలాంటి ఎన్నో తప్పుడు వార్తలు సృష్టించి టీడీపీ జనసేన పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని ఇరు పార్టీల కార్యకర్తల మధ్యలో గొడవలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు వీటిని దయచేసి నమ్మకండి ఇరు పార్టీల అధినేతలు మరియు నాయకులు వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేసే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలన్న ధ్యేయంతో ముందుకు వెళుతున్నారు ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం చేసే కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని మేము కోరుకుంటున్నాం అని అన్నారు. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు లేవని యువత, మహిళలు, రైతుల బంగారు భవిష్యత్తు కోసం జనసేన – తెదేపా పార్టీలకు అండగా నిలవాలని రమాదేవి కంచల గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన – తెదేపా పార్టీలకు అండగా నిలవాలని రాబోయే జనసేన – తెదేపా ప్రభుత్వంలో మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.