నందిగామలో పల్లె పధాన జనసేన

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గంలోని పల్లె పధాన జనసేన కార్యక్రమంలో భాగంగా నందిగామ మండలంలోని పెద్దవరం, చెరువు కొమ్ముపాలెం, పాత బెల్లంకొండ వారి పాలెం, గ్రామాలను పర్యటించి అక్కడ ఉన్న గ్రామస్థలను కలసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకొని వారికి ఆ సమస్యలకు పరిష్కారం ఏవిధంగా చేయాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని తెలియజేసి వాటిని త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని వారి భరోసా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఈ గ్రామాలను నేను పర్యటించడానికి వస్తున్న సమయంలో రోడ్ల దుస్థితి చాలా హీనంగా ఉందని, కనీసం ఈ గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా అందించలేని ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ విఫలమయ్యారని రమాదేవి అన్నారు. నవనందిగామ నిర్మాతలు అని చెప్పుకోవడం కాదు ఒకసారి ఓట్ల కోసం ఎన్నికల ముందు వచ్చారు కదా, ఇప్పుడు వచ్చి ఈ రోడ్లలో తిరిగి రోడ్ల దుస్థితి ఎలా ఉందని నేరుగా చూసి తెలుసుకోండి అని మీడియా ముఖంగా వారిని ప్రశ్నించారు. నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే మేము ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధంగా ఉన్నామని తెలియచేస్తున్నాం. మీ అభివృద్ధి అజెండాలో రోడ్ల మరమ్మత్తు చేయాలనే పాయింట్ ని మీరు విస్మరించినట్లు ఉన్నారు, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో పాయింట్లు మీరు మీ అభివృద్ధి లో భాగంగా చేసుకుని అప్పుడు అడగండి ఓట్లు ప్రజలను. ఇకపోతే ఈ మూడు గ్రామాలు పర్యటించాక అన్ని గ్రామాల్లోనూ నా దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు రోడ్లు, తాగునీరు, సాగునీరు, ఇక్కడ కనీసం పనికి తగిన జీతం కూడా అందడం లేదు, వేదాద్రి ఎత్తిపోతల పథకం, డ్రైనేజీ వ్యవస్థలు లేకపోవడం, వైద్య సదుపాయాలు తక్కువగా ఉండటం. పేరుకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, కానీ అందులో ఎమర్జెన్సీగా కావాల్సిన మెడిసిన్స్ కూడా అందుబాటులో లేకపోవడం వైసిపి ప్రభుత్వం ఎంతగా విఫలమయిందో ఇక్కడ పరిస్థితులను చూస్తే అద్దం పట్టినట్లు కనిపిస్తున్నాయి అని అన్నారు. తర్వాత చివరగా పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామస్తులు జనసేన సిద్ధాంతాలు నచ్చి అక్కడ యువత 20 కుటుంబాలు జనసేన పార్టీలో రమాదేవి చేతులు మీదుగా కండువా కప్పించుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జన సైనికులు మరియు వీర మహిళలు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.