తంబళ్లపల్లి రమాదేవి ఆధ్వరంలో పల్లె పధాన జనసేన

నందిగామ నియోజకవర్గం: నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను వారి కష్టాలను తెలుసుకునే ప్రయత్నంగా మొదలుపెట్టిన “పల్లె పధాన జనసేన” కార్యక్రమంలో భాగంగా, మంగళవారం నందిగామ మండలంలోని తక్కెళ్ళపాడు, లింగాలపాడు అడవిరావులపాడు గ్రామాలు పర్యటించారు. చివరగా అడవి రావులపాడులో అక్కడి గ్రామస్తులు పడుతున్న ఇక్కట్లను స్వయంగా అనుభవించి తెలుసుకోనుకోవాలని రాత్రి అక్కడే బస చేయడం జరిగింది. అక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం చేత కాలవలు శుభ్రం చేయకపోవడంతో రాత్రంతా దోమలు బెడద ఉందని, అందువలన దోమ కాటుకు గురై అక్కడి గ్రామస్తులకు అనారోగ్యాలు తరచూ వస్తుంటాయని తెలుసుకోవడం జరిగింది. రమాదేవి బస చేసిన ప్రాంతంలోనే, అర్థరాత్రి ప్రమాదవశాత్తు వరిగడ్డి నిల్వ చేసి ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇంతలో జనసైనికులు అప్రమత్తమై వెళ్ళి నిప్పులార్పడానికి ప్రయత్నం చేశారు. ఒక గంట సేపు ప్రయత్నించగా మంటలు అదుపులోకి వచ్చాయి. గంట తరువాత ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్లే సమయానికి ఫైర్ ఇంజన్ కూడా రాలేక ఆలస్యంగా అక్కడికి చేరుకోవడం చూసిన రమాదేవి, ప్రజలకి ఏ అవసరం వచ్చినా రోడ్లు బాగోలేక పోతే సమయానికి చేరుకోలేరు, ప్రాణం నష్టం కలిగే ప్రమాదం కూడా ఉందని చాలా బాధపడ్డారు. సమయానికి స్పందించిన జనసైనికులు అందరిని ఆమె అభినందించారు. పొద్దున్నే లేచి అక్కడి గ్రామస్తులు అందరిని ఒకచోటకు పిలిపించి వారందరికీ జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ ని ప్రమోట్ చేస్తూ తంబళ్లపల్లి రమాదేవి అందరికీ గాజు గ్లాసులో టీ ఇచ్చి వారితో ముచ్చటిస్తూ, గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇంతలో కొందరు గ్రామస్తులు వచ్చి రాత్రి జరిగిన ప్రమాదం గురించి వివరించి గ్రామస్తులంతా జనసేన పార్టీకి, జనసైనికులకి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గ్రామస్తులంతా ఒకే తాటిపై నిలబడి జనసేన పార్టీని బలపరుస్తామని రమాదేవికి మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జనసేన నాయకులు జనసైనికులు వీరమహిళలు అడవి రావులపాడు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.