శివరాత్రి ఉత్సవాలకు గంగులయ్యకు ఆహ్వానం

  • శివరాత్రి ఉత్సవాలకు గంగులయ్యను ఆహ్వానించిన బొడ్డపుట్టు గ్రామస్తులు

అల్లూరిసీతారామరాజు జిల్లా, పాడేరు జనసేనపార్టీ కార్యాలయంలో పాడేరు, అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్యను బొడ్డపుట్టు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా డా. గంగులయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యం గిరిజనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది, ఎంతో ఉన్నత చదువులు చదువుకున్నా గిరిజన యువతకి సరైన ఉపాధి లేదు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించే జీవో నెం3 పై మీనమేషాలు లెక్కబెడుతుంది ఈ ప్రభుత్వం. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర లేదు, సరైన రవాణా సదుపాయం లేదు, ఇప్పటికి డోలి మోతల దుస్థితి చూస్తుంటే మనసు కలిచివేస్తుంది. గిరిజన హక్కులు, చట్టాలకు తిలోదకాలు ఇచ్చి తమపని తాము గుట్టుగా చేస్తున్న ప్రభుత్వం తీరు పూర్తిగా ఆక్షేపనియం. గిరిజన భాష లంటే ప్రభుత్వానికి చిన్న చూపు ఉందని అందుకే గిరిజన భాష ప్రాతిప్రదికన ఏర్పాటైన భాష వాలంటరీ ఉపాధ్యాయులపై అణచివేత, వివిధ శాఖల ఉద్యోగుల నోరు నొక్కుతున్న ప్రభుత్వం. ఆశ్రమ పాఠశాల విద్యార్థుల ఆరోగ్య వ్యవస్థ కోసం ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది. ఆరోగ్యకార్యకర్తలను తొలగించేసి గిరిజన విద్యార్థుల మరణాలకు ప్రత్యక్ష కారణం ప్రభుత్వ విధానమే. ఇంకా అభివృద్ధి మాట ఎరుగని గిరిజన పల్లెలు అనేకం ఉన్నాయి. గ్రామాభివృద్ధి కుంటుపడింది. గ్రామ పంచాయితీ అభివృద్ధి మాట దేవుడెరుగు, సర్పంచ్ లు ప్రజలకు సమాధానం చెప్పుకోలేని దుస్థితి ఎస్.టి సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళింది. ఈ సారి గిరిజనులు చైతన్యవంతమైన ఆలోచన చేయకపోతే భవిష్యత్ తరాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక్కటని కాదు అనేక రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇకనైనా గిరిజన హక్కులపై స్పష్టత ఉన్న జనసేనపార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గెలుపే లక్ష్యంగా ఉన్నామని, మాకు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందని తెలిపారు. బొడ్డపుట్టు గ్రామ పెద్దలు మాట్లాడుతూ మేము కూడా ఖచ్చితంగా మార్పు దిశగా ఆలోచన చేస్తున్నామని, జనసేన పార్టీ గ్రామస్థాయి పర్యటనలో మా వంతుగా కృషి చేస్తున్నామని, మా గ్రామంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు మీరు ప్రధాన అతిధిగా హాజరుకావాలని, మీ రాక కోసం మా గ్రామప్రజాలందరు ఎదురుచూస్తుంటామని అన్నారు. ఈ సందర్భంగా తప్పకుండా వస్తానని డా. గంగులయ్య సమ్మతం తెలిపారు.