బెంతు ఒరియాల దీక్షకు మజ్జిపుట్టుగ గ్రామస్తుల మద్దతు

మజ్జిపుట్టుగ: బెంతు ఒరియా కులస్తులు కుల ధ్రువీకరణ పత్రాలు పునరుద్దరణ కొరకు కొనసాగిస్తున్న 24వ రోజు రిలే నిరాహారదీక్షలో మజ్జిపుట్టుగ గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులపెద్ద మోహన్ మజ్జి, గోపి బిసాయి మాట్లాడుతూ ఇచ్ఛాపురం నియోజక వర్గంలో గల కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో ఉన్న బెంతు ఒరియాలకు కలధ్రువ పాత్రలు జారీ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఏటువంటి జీఓ లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు అకారణంగా నిలిపి వేయడం వల్ల విద్యార్థుల భవిషత్ బుగ్గిపాలు అయిందిదని ఆవేదన వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో కులపెద్ద మోహన్ మజ్జి, దొండోపాని, జాదవ్, బృందావన్, గోపి, ప్రేమ్, నిరంజన్, దుదిస్టి, మన్మథ, పుర్ణో, రూపో తదితరులు పాల్గొని న్యాయం చేయాలని ప్రభుత్వానికి నిరసన తెలిపారు.