*జనసేన మండలాధ్యక్షుడు ధనుంజయ
పామిడి పంచాయతీ కార్యాలయం ఆవరణంలో జరిగిన గ్రామ సభలో జనసేన పార్టీ మండలాధ్యక్షులు ధనుంజయ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలను చర్చించి పరిష్కారానికి మార్గం చూపుతున్న ఘనత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిదని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖను ముందుండి నడిపిస్తూ గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా మద్దతుగా నిలవడం వల్ల కూటమి ప్రభుత్వం అభివృద్ధి + సంక్షేమం అనే ద్విపథంలో ప్రజలకు సేవ చేస్తోందన్నారు. ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా గుర్తించి కూటమి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని ధనుంజయ పిలుపునిచ్చారు. ఈ గ్రామ సభలో డిప్యూటీ ఎంపీడీవో, ఈవో, కూటమి టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, ప్రభాకర్ చౌదరి, గౌస్, జింకల సంజీవ, శివ, జనసేన నాయకులు సూర్యనారాయణ, పెన్నా ఓబులేసు, నక్కల రామాంజనేయులు, ఆఫ్జల్, నబి, రసూల్, బీజేపీ నాయకురాలు లక్ష్మీదేవి మరియు పామిడి ప్రజలు భారీగా పాల్గొన్నారు.
Share this content:
Post Comment