యూసఫ్ పఠాన్ ఖాన్ కు అండగా నిలిచిన వినుకొండ జనసేన

వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్త యూసఫ్ పఠాన్ ఖాన్ గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంగా వారికి వినుకొండ జనసేన పార్టీ నాయకులు కొణిజేటి నాగ శ్రీను సోమవారం గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావుకి ఈ సమస్యని వివరించడం జరిగింది. అనంతరం వినుకొండ జనసేన పార్టీ తరఫున వారికి హాస్పటల్ ఖర్చుల నిమిత్తం 20000/- రూపాయలు ఆర్థిక సహాయాన్ని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో శావల్యాపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్, నూజెండ్ల మండల ఉపాధ్యక్షులు పసుపులేటి రజిబాబు, గండికోట మణికంఠ, కామిశెట్టి కిషోర్, ఆసా మనోహర్, తిరుమలశెట్టి అనిల్, తెల్లమేకల రమేష్, భిమానాద్ పవన్, పారేళ్ల అభిమన్యు పాల్గొన్నారు.