తొట్టంబేడు మండలం, విరూపాక్షపురం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ట మరియు మహా కుంభాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామస్థుల ఆహ్వానం మేరకు ఈ పవిత్ర కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి వినుత కోటా గారు హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు తౌండు రమేష్, జనసైనికులు, గ్రామ పెద్దలు వినుత కోటా దంపతులను ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల ఇంచార్జి పేట చంద్ర శేఖర్, నాయకులు కావలి శివకుమార్, తోట గణేష్, మని, లక్ష్మణ్, పేట చిరంజీవి, తులసీ రామ్, వెంకట రమణ యాదవ్, హేమంత్, జ్యోతి రామ్, డుమ్ము రాయల్, సురేష్ తదితరులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Share this content:
Post Comment