నో మై కాన్స్టిట్యూఎన్సీ లో భాగంగా నారాయణపురంలో వినుత కోటా పర్యటన

*నో మై కాన్స్టిట్యూఎన్సీ: 26వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా.. పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి మండలంలోని నారాయణపురం పంచాయతీలో.. నారాయణపురం గ్రామంలో పర్యటించి.. ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది.

నారాయణపురం గ్రామంలో సమస్యలు: గ్రామానికి వెళ్ళే రోడ్ గుంతలమయంగా ఉంది, డ్రైనేజీ కాలువలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, గ్రామం నుండి పొలాలకి వెళ్ళే దారిలో కాలువకు వంతెన నిర్మాణం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు శ్రీమతి వినుత కు తెలియజేశారు. సమస్యలను మండల అధికారుల, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులుడా. పవన్ సాయి, రవి కుమార్ రెడ్డి, నితీష్, వినోద్, చందు చౌదరి, సురేష్, వెంకటరమణ, శ్రీనివాసులు, అశోక్, మాధవ,లక్ష్మీపతి, పంచాయతీలోని జనసైనికులు పాల్గొన్నారు.