నో మై కాన్స్టిట్యూఎన్సీ లో భాగంగా రచపాలెం లో పర్యటించిన వినుత కోటా

  • నో మై కాన్స్టిట్యూఎన్సీ: 28 వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఏర్పేడు మండలంలోని రచపాలెం గ్రామంలో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రచపాలెం గ్రామంలో సమస్యలు: త్రాగు నీరు సమస్య, స్ట్రీట్ లైట్లు లేవు, డ్రైనేజీ కాలువలు లేవు, సీసీ రోడ్లు లేవు అని వారి సమస్యలను గ్రామస్థులు వినుత కు తెలియజేశారు. ఆ సమస్యలను మండల అధికారుల, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని మండల. ఇంచార్జి కిరణ్ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కిరణ్, ఉప అధ్యక్షులు లోక వంశీ, రవి, వంశీ, కృష్ణ, ఈశ్వర్, పవన్, నిఖిల్ జనసైనికులు పాల్గొన్నారు.