నో మై కాన్స్టిట్యూఎన్సీ లో భాగంగా రెడ్డి పల్లిలో పర్యటించిన వినుత కోటా

*నో మై కాన్స్టిట్యూఎన్సీ 29 వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా.. పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యూఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి మండలంలోని రెడ్డి పల్లి పంచాయతీలోని రెడ్డి పల్లి, రెడ్డి పల్లి హరిజనవాడ గ్రామాల్లో పర్యటించి ఇంటిటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. రెడ్డి పల్లి హరిజనవాడ గ్రామంలో సమస్యలు ప్రధానంగా త్రాగు నీరు సమస్య, డ్రైనేజీ కాలువలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు.. మరియు రెడ్డి పల్లి గ్రామంలో సమస్యలు ప్రధానంగా త్రాగు నీరు సమస్య, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిత్యావసర వస్తువుల ధరల పెంపు మొదలగు సమస్యలను గ్రామస్థులు వినుతకి తెలియజేశారు. సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కొరకు జనసేన పార్టీ కృషి చేస్తుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు నితీష్ కుమార్, రవి కుమార్ రెడ్డి, శ్రీను, శ్రీనివాసులు, గిరీష్, అశోక్, కుమార్, తేజా, జనసైనికులు పాల్గొన్నారు.