‘విరాటపర్వం’ టీజర్

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండగా రానా నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

డిసెంబర్ 14 రానా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలో రానా .. రవిశంకర్ అలియాన్ రవన్న అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలియజేశారు. 1990లో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పున:ప్రారంభమైంది. ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌ చంద్ర, నివేదా పేతురాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందిస్తున్నారు.