విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు: గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్

జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా జనసేన పార్టీ తరఫున ఈ నెల 18, 19, 20 తేదీల్లో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు శనివారం(18-12-2021)ఉదయం 11.00 గంటలకు టేకిశెట్టిపాలెం, అప్పనరామునిలంక ప్రధాన కూడలిలో  జనసేన పార్టీ నాయకులు గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లే కార్డ్స ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో, ex ఎంపీపీ లింగోలు చిన్నబ్బులు గారు , గ్రామ సర్పంచ్ విస్సా దేవి దుర్గ ,వైస్ ప్రెసిడెంట్ కటికిరెడ్డి మహేష్, మాజీ సర్పంచ్ గెడ్డం పేర్రాజు, రావూరి సూర్యనారాయణ (పెద్దబ్బులు) ,విస్సా తాతయ్య నాయుడు, కందుల పాటి ఆంజనేయులు, నల్లి జయరాజు,పెద్దపాటి నరేంద్ర, గిడుగు రాంబాబు మరియు టేకిశెట్టిపాలెం, అప్పనరామునిలంక జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.