ఎంతోమంది త్యాగల ఫలితామే విశాఖ స్టీల్ ప్లాంట్: పాఠంశెట్టి కాశీరాణి

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సోషల్ మీడియా వేదికగా డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టాలని జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెదపూడి మండలం, రామేశ్వరం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి జనసేన వీరమహిళ పాఠంశెట్టి కాశీరాణి రెండవ రోజు నిరసన చేపట్టారు. ఈ మేరకు నాయకుల ఆదేశానుసారం రామేశ్వరం గ్రామంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు…. సేవ్ స్టీల్ ప్లాంట్ అంటూ ప్లకార్డులతో ఎంపీలు పార్లమెంట్ లో స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎంతోమంది త్యాగల ఫలితామే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని….. అటువంటి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీలు పార్లమెంటు సమావేశంలో గళం విప్పాలని కోరారు. ఎంపీలను మేలుకొలిపేందుకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగుతుందని స్పష్టం చేశారు.