విశాఖ వేదికగా వైభవంగా యోగాంధ్ర–2025

జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “యోగాంధ్ర–2025” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యోగా భారత సంస్కృతిలో శారీరక, మానసిక ఆరోగ్యానికి మూలస్తంభంగా నిలుస్తోంది. మోదీ గారి ప్రోత్సాహంతో యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం గర్వకారణం. ఈ అద్భుత కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం విశేషం. లక్షలాది మంది ప్రజలు భాగస్వాములుగా మారి విజయవంతం చేసిన ఈ యోగ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిలిచింది.

Share this content:

Post Comment