విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఉగాది పురస్కారం – వర్తనపల్లి కాశీకి సన్మానం

తాడేపల్లిగూడెం, విశ్వగురు వరల్డ్ రికార్డ్ ఉగాది పురస్కరించుకొని ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలు నుండి సోషల్ సర్వీస్ లో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్లు నైపుణ్యం చూపిస్తున్న వాళ్లకి, కళాకారులకు, మెడికల్ అత్యున్నత స్థాయి సేవ చేసిన వారికి అవార్డు ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగా 2025 సంవత్సరానికి రెండు రాష్ట్రాల నుండి సుమారు 25 మందిని ఎంపిక చేశారు. ఇందులో పశ్చిమగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీని ఎంపిక చేయడం అభినందనీయం కావున ఈరోజు వారికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జనసేన పార్టీ ప.గో జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం యువజన అధ్యక్షులు అత్తిలి బాబి జిల్లా ఉపాధ్యక్షులు బారిశెట్టి నరసింహమూర్తి, పెంటపాడు మండల అధ్యక్షులు కాజులూరు దుర్గా మల్లేశ్వరరావు, పళ్ళవర్తక సంఘం గౌరవ అధ్యక్షులు రౌతు సోమరాజు తదితర పట్టణ ప్రముఖులు పాల్గొనడం జరిగింది.

Share this content:

Post Comment