సిఎం జగన్ ప్రకటించిన విజన్ విశాఖ ఒక డ్రామా: కోన తాతారావు

విశాఖ, ద్వారకానగర్ – పౌర గ్రంధాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సి.ఎం జగన్ ప్రకటించిన విజన్ విశాఖపై కోన తాతారావు మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరుతొ మూడు ముక్కలాట ఇంకెన్నాళ్లు ఆడుతారు, ప్రజల చెవిల్లో ఎన్నిసార్లు పూలు పెడతారని, ముఖ్యమంత్రిగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేసి, ఇక్కడ నుంచే పాలన చేస్తానడం హాస్యాస్పదమని, జగన్ రెడ్డి మళ్లీ ప్రమాణ స్వీకారం చేసేది బంగాళాకాతంలోనే, ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏపికి వైసిపి నుంచి విముక్తి కలిగించే తీర్పు ఇవ్వబోతున్నారు. మీ మీద నమ్మకం లేక రెండోసారి వైసిపి రాదని వైసిపిని వీడి జనసేన-టిడిపి పార్టీల్లోకి లైన్ కడతున్నారు. దోపిడి, దౌర్జన్యం, భూకబ్జాల ద్వారా విశాఖ మహా నగరంగా ఎదగదు. పదే పదే విశాఖ రాజధాని అని చెప్పి 5 ఏళ్లలో విశాఖలో ఒక్క భవనం కూడా కట్టలేదు. జగన్ సతీమణి కోరిక మేరకు రుషికొండలో రాజ సౌదం మాత్రం కట్టుకున్నారు. ప్రశాంత నగరంగా ఉన్న విశాఖను అరాచకశక్తుల అడ్డాగా మార్చారు. గ్రాఫిక్స్ లో చూపించిన విజన్ విశాఖ రాజమౌళి చూపించిన బహుబలి గ్రాఫిక్స్ కు మించిపోయింది. గత ఏడాది జనవరి లో ఢిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్ర్స్ సమ్మిట్ లో చేసుకున్న ఎమోయు లు ఎక్కడ పీపీపీ మోడ్ లో పెట్టుబడులు తెస్తామని చెప్పడం స్వలాభం కోసమే ఇప్పటికే పిపిపి మోడ్ లో నిర్మించిన గంగవరం పోర్టు ఆదానికి కారు చౌకగా అమ్మేసారు. ఉన్న పరిశ్రమలు వెళ్లగొట్టారు ప్రకటనలే తప్ప కొత్త పరిశ్రమలు తేలేకపోయారు. విశాఖ ప్రజల కోరుకునేది ఉపాధి, అభివృద్ధి తప్ప రాజధాని కాదు. ఇప్పటికే విశాఖలో రాజధాని పేరు చెప్పి సహజ వనరులు దోచుకోవడం, భూ కబ్జాలు చేయడం ద్వారా 26,000 కోట్లు ప్రజల ఆస్తులను లూటీ చేశారు. కన్వెన్షన్ సెంటర్, అంత్రజాతీయ క్రికెట్ స్టేడియయ్ వస్తే విశాఖ మహా నగరంగా మారిపోతుందా. 2019 లో సిఎం చెప్పిన విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఎక్కడ , గాజువాక, మధురవాడల మద్య నిర్మిస్తానన్న 12 ఫ్లై ఓవర్ ల్లో ఒక్కటైనా శంకుస్థాపన చేశారా విశాఖలో ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ 18 వేల కోట్లకు తాకట్టు పెట్టేసారు. కడప నుంచి వచ్చిన రెడ్డి లు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని, భూ దందాలపై రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద్ రావు గతవారంలో వాక్యానించిన విషయం వైసిపి పాలనకు అద్దం పడుతుందని అన్నారు. ఈ సమావేశంలో విశాఖ నార్త్ ఇంచార్జ్ పసుపులేటి ఉషాకిరణ్, కార్పొరేటర్లు మూర్తి యాదవ్, దల్లి గోవింద్ రెడ్డి పాల్గొన్నారు.