లిడిగి వలస గ్రామంలో జనసేన నాయకుల పర్యటన

పార్వతీపురం నియోజకవర్గం: గోచెక్క పంచాయతీలో, లిడిగి వలస గ్రామంలో పార్వతీపురం నియోజకవర్గ జనసేన నాయకులు అక్కివరపు మోహన్ రావు, మండల అధ్యక్షురాలు ఆగూరు మణి, నియోజకవర్గ నాయకులు చెట్లు గణేష్, ఖాత విశ్వేశ్వర రావు, కర్రి మణికంఠ, జనసైనికులు పర్యటించడం జరిగింది.. గ్రామంలో అడుగుపెట్టగానే ఆ గ్రామ ఆడపడుచులు హారతులతో స్వాగతం పలకడం జనసేన బలం పెరిగిందని చెప్పడానికి ఒక నిదర్శనం.. వాళ్లు మన పార్టీ పట్ల నాయకులు పట్ల చూపించిన ప్రేమ అభిమానాలు మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసాయి.. ఈరోజు జరిగిన సంఘటన ఒక వాస్తవాన్ని తెలియజేస్తుంది.. మిగతా రెండు పార్టీల కంటే ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న పార్టీ జనసేన పార్టీ అని కళ్ళకు కట్టినట్లు ఈ సన్నివేశం చూపిస్తుంది.. పవన్ కళ్యాణ్ గారు కోరుకునే మార్పు అతి సమీపంలో ఉంది అనే విషయాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది. గ్రామ ప్రజలు తిలకం దిద్ది, దండలు వేసి, పువ్వులు జల్లి, డప్పుల దరువులతో ఒక పండుగలా ఊరేగిస్తూ మమ్మల్ని ఆదరించారు అంటే అది పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్లకున్న ప్రేమ మాత్రమే. నాయకులారా.. జనసైనికులారా… వీర మహిళలారా.. మనలో మనం విమర్శించుకుంది ఇక చాలు.. మనలో మనం తన్నుకుంది ఇక చాలు… మనలో మనం చాడీలు చెప్పుకుంది ఇక చాలు.. రండి.. అందరం కలిసి జనంలోకి వెళ్దాం.. జనసేన బలాన్ని నిరూపిద్దాం.. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిద్దాం అని పార్వతీపురం నియోజకవర్గ జనసేన నాయకులు పిలుపునిచ్చారు.