మెట్టవీధి గ్రామంలో జనసేన నాయకుల పర్యటన

  • మెట్టవీధి గ్రామస్తులతో సమావేశమైన జనసేన నాయకులు

పాడేరు: అల్లూరీ సీతా రామరాజు జిల్లా, చింతపల్లి మండలం జనసేన పార్టీ నిర్వహించే గ్రామపర్యటనలో భాగంగా ఆదివారం మెట్టవీధి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామస్తులతో జనసేన పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ప్రస్తుత గిరిజనప్రజాల స్థితిగతులపై చర్చించారు. ఈ సమావేశంలో గ్రామస్తులనుద్దేశించి ప్రస్తుతం ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలు ఎలా అమలుచేస్తుందో వివరిస్తూ గత మార్చ్ నెల 24వ తేదీన బొయవాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేసిన ముఖ్యమంత్రి గారు తమ ఓటుబ్యాంక్ కుహనా రాజకీయాలకు తెరలేపారు. అన్నివిధాలుగా గిరిజన ప్రజల అభివృద్ధిని విస్మరించి నేడు ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. మన గిరిజన ప్రజాప్రతినిధులు కూడా ఈ విధమైన జాతి ప్రయోజనాన్ని విస్మరించి తమ పదవులు శాశ్వతమనుకొని ప్రజాప్రతినిధులు నేడు గిరిజనాభివృద్ధికి జగనన్న మాత్రమే సమర్థుడని, అతనే కావాలని వాస్తవ విషయాలు ఏమార్చి గిరిజన జాతి నైతిక విలువలు మరిచి పిలుపునిస్తున్నారు. ఇదెక్కడి నీతి మాలిన రాజకీయాలో అర్థం కాదు. ఒక జాతి ఆస్తిత్వంపై కుట్రలు చేస్తుంటే నోరుమెదపకుండా, జాతికి సమాధానం చెప్పలేని మన ప్రజాప్రతినిధులు ఇవాళ జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో రోడ్డు విస్తీర్ణంపై ఒకరినొకరు తిట్టుకుంటూ, విమర్శిస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. ఇదంతా కేవలం ఓటుబ్యాంక్ రాజకీయల కోసమేనని, ఇలాంటి మోసపూరిత రాజకీయ పార్టీలను నమ్ముతున్నంత కాలం గిరిజనాభివృద్ది నల్లేరుపై నడకేనని అన్నారు. జనసేన పార్టీ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ, పారదర్శక రాజకీయాలు చేస్తుందని, గిరిజన ప్రాంతాలను అవినీతి రహిత పాలన వ్యవస్తవైపు నడిపించకపోతే భవిష్యత్ తరాలకు భవిష్యత్ లేదని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ లీగల్ అడ్వైజర్, కిల్లో రాజన్, అరడ స్వామి, చింతపల్లి మండల నాయకులు వంతల బుజ్జిబాబు, రవికుమార్ రాజబాబు, నాయక్, శేఖర్, అశోక్ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.