వెల్లటూరులో జనసేన నాయకుల పర్యటన

వెల్లటూరు గ్రామంలో జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ ఆదివారం పర్యటించడం జరిగింది. వెల్లటూరులో సరైన సిసి రోడ్లు లేవు మరియు సైడ్ కలవలు కూడా లేవు. ఓట్లు కోసం మాత్రమే నాయకులు వస్తారు తప్ప, తర్వాత కనిపించరు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం కనీసం ఒక గంపనిండా సిమెంట్ వేసిన పాపాన పోలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వెల్లటూరు గ్రామ ప్రజలు. ఆదివారం పొన్నలూరు మండలంలో వెల్లటూరు గ్రామంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు “కనపర్తి మనోజ్ కుమార్” పర్యటించడం జరిగింది. వెల్లటూరులో ఎస్సీ కాలనీలో సైడ్ కాలువలు లేక నీళ్లు నిల్వ ఉండి ప్రజలు చాలా ఇబ్బందులు గురి అవుతున్నారు. నీళ్లు నిల్వ ఉండటంవల్ల ఎన్నో రకాల అనారోగ్యాలకు గురి అవుతున్నారు, ఎస్సీ కాలనీలో ఓట్ల కోసం మాత్రమే నాయకులు వస్తారు తప్ప వారిని పట్టించుకున్న పాపాన పోలేదు, జనసేన పార్టీ వెల్లటూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఎస్సీ కాలనీవాసులకు అండగా ఉంటుంది, అతి తొందరలో తగిన అధికారులతో మాట్లాడి వారికి న్యాయం జరిగేలా చూస్తాము, ఎస్సీ కాలనీలో సైడ్ కలువలు ఏర్పాటు చేసే విధంగా జనసేన పార్టీ పోరాటం చేస్తుంది, ముఖ్యంగా వెల్లటూరులో ఎస్సీ కాలనీవాసులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది వారికి ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ ముందుండి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది.