అన్నవరం గ్రామంలో వీరఘట్టం మండల జనసేన టీమ్ పర్యటన

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గంకి సంబందించిన అన్నవరం గ్రామంలో వీరఘట్టం మండల జనసేన టీమ్ పర్యటన చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ కూటమి బలపరిచిన జనసేన యం యల్ ఏ అభ్యర్థి శ్రీ నిమ్మక జయకృష్ణ గారు పోటీ చేస్తున్న గుర్తు గాజు గ్లాస్ గుర్తుకి అత్యధిక ఓటు మెజారిటీతో మీ అన్నవరం గ్రామం ప్రజలు గాజు గ్లాస్ కి ఓటు వెయ్యాలి అని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, పాలకొండ నియోజకవర్గంని స్థానిక నాయుకులు & జగన్ నాశనం చేసేసారు కనుక ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. పాలకొండలో జయకృష్ణ గారు జనసేన పార్టీ గెలవాలి అని జనసేన జానీ అన్నారు. ఈ కార్యక్రమంలో వీరఘట్టం టౌన్ జనసేన అధ్యక్షులు సరిపల్లి అచ్యుత్, టౌన్ యంగ్ & డైనమిక్ లీడర్స్ కర్నెన సాయి, పవన్, నందివాడ పండు, ఉదయాన చరణ్, మేడిద సందీప్, అరసాడా హరి పాల్గొన్నారు.