శ్రీకాళహస్తి నియోజకవర్గం: కడప నేషనల్ హై కోసం రేణిగుంట మండలం, కటకంబాడి, దొడ్ల మిట్ట గ్రామంలో రైతులు ఇల్లు, భూములు కోల్పోయారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే అధిక రేటు ఇచ్చి, మిగిలిన వారికి తక్కువ రేటు ఇచ్చారని, ఇంకా చాలా మందికి నష్టపరిహారం డబ్బులు ఇవ్వలేదని కొన్ని రోజుల క్రితం రైతులు, మహిళలు జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా దృష్టికి తీసుకుని వచ్చారు. శుక్రవారం కరకంబాడి ప్రాంతంలో వినుత కోటా పర్యటించి అక్కడ బాధితులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో అన్యాయంగా తక్కువ రేటు ఇచ్చారని, ఇంకా చాలా మందికి రోడ్డు కాంపెన్సేషన్ ఇవ్వలేదని తెలిపారు. తప్పకుండా కలెక్టర్ గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి మళ్లీ రీ సర్వే చేయించి అందరికీ ఒకే రేటు వచ్చేలా న్యాయం చేస్తామని తెలిపారు. నష్ట పరిహారం రాని వారికి త్వరగా వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నగరం భాస్కర్ బాబు, నాగరాజు, భాగ్య లక్ష్మి, తిలక్, బాలాజీ, ముకేష్, అనురాధ, సతీష్, దీన దయాళ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment