తోట సుధీర్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీల సందర్శన

కాకినాడ సిటీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా #FailureOfJaganannaColony అనే హ్యాష్ ట్యాగ్ తో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే ఈ కార్యక్రమంలో భాగంగా ఆ కాలనీలో ఉన్న అవకతవకలు నీట మునిగిన గృహాలు స్వయంగా చూసి అవి ప్రజలకు అర్ధమయ్యే విధంగా తెలియజేయడం చేయడం జరిగింది. కాకినాడ నగర అధ్యక్షులు తోట సుధీర్ సీనియర్ నాయకులు విజయ్ గోపాల్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, కాకినాడ సిటీ ఐటీ కో-ఆర్డినేటర్ ఎల్చూరి వరప్రసాద్, స్టేట్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి శివ ప్రసాద్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి అట్లా సత్యనారాయణ, శ్రీమన్నారాయణ, మండపాక దుర్గాప్రసాద్, మోస ఏసుభు, వాసు, అమర్ తదితరులు పాల్గొన్నారు.