వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సందర్శన

కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా #FailureOfJaganannaColony అనే హ్యాష్ ట్యాగ్ తో జగనన్న కాలనీ సోషల్ మీడియా క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది. జగనన్న కాలనీ ఇళ్ళ స్థలాలను సందర్శించే ఈ కార్యక్రమంలో భాగంగా ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలో జగనన్న కాలనీ దుస్థితి గురించి, అక్కడ జరుగుతున్న అక్రమాలు గురించి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.