పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం, రాజోలు మండలం జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు బుధవారం ఇంటి పెద్దలను కోల్పోయిన కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, అకాలమరణం చెందిన వారికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు. ప్రజల కష్టాలు మన కష్టాలుగా తీసుకున్నపుడే వారితో మమేకం అవ్వగలం అన్నారు. రాజోలు నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాను అని ఆయన అన్నారు. రాజోలు మండలంలో బి.సావరం, సోంపల్లి, రాజోలు 1, రాజోలు2 పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వలసల బాట పట్టవద్దు. మన మేధస్సు మన రాష్ట్రానికి, మన దేశానికి ఉపయోగపడేలా ఉండాలి అన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం లో జనసేన పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం అన్నారు. యువశక్తి నిర్వీర్యం అవుతుంటే చూస్తూ ఊరుకోము అని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని ఆయన హితవు పలికారు.