24 గంటల్లో రోడ్లకి ఇరువైపున ఇబ్బందిగా ఉన్న కంచె చెట్లను తొలగించిన జనసేన

06.10.2021 గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు, యారాడ గ్రామస్థులు మరియు గంగవరం గ్రామ మత్స్యకారులు గంగవరం, యారాడకు వెళ్లే రహదారి కంచె చెట్లతో పూర్తిగా రహదారి ఇబ్బందిగా ఉందని, 64 వార్డ్ కార్పొరేటర్, శ్రీ దల్లి గోవింద రాజు దగ్గరికి వచ్చి, సమస్యను విన్నవించుకున్నారు. సమస్య చెప్పిన 24 గంటల్లోనే గంగవరం నుండి, యారాడ వెళ్లే రహదారి, కంచె చెట్లు మొత్తం ప్రజలకు ఇబ్బంది లేకుండా, కార్పొరేటర్ దగ్గర ఉండి పని పూర్తి చేయించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తానని.. అలాగే జనసేన నాయకులు, జనసైనికులు, నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నారని, ఆయన తెలియజేశారు. శ్రీ గోవింద రాజును కలిసి గంగవరం గ్రామ మత్స్యకారులు, యారాడ వాస్తవ్యులు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య, మాజీ సోషల్ జస్టిస్ నూకరాజు, మెగా నూకరాజు, సాయి, నగేష్, తోవిటయ్య, రెడ్డి సన్యాస, సంజయ్, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.