విజయనగరం జనసేన ముఖ్య సమావేశం

విజయనగరం, జనసేన పార్టీ విజయనగరం (స్థానిక పాల్ నగర్ దగ్గర) కేంద్ర కార్యాలయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి కార్యచరణకై మంగళవారం ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనసేన-తెలుగుదేశం సమన్వయకర్త మరియు జె.ఏసి కమిటీ సభ్యురాలు, మరియు జనసేన పార్టీ విజయనగరం నియోజకవర్గ ఇన్చార్జ్ పాలవలస యశస్వి కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.