వాలీబాల్ కిట్లు పంపిణీ

జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి తన క్రీడభిలాషను మరొక మారు చాటుకున్నారు. ఎగువశోభ గ్రామ పంచాయితీ వాలిబాల్ టీమ్ ఆట తీరుని మెచ్చుకుని వారికి ప్రోత్సాహం ఇవ్వాలని ఆదివారం వారి కొచ్ సుబ్బారావు మరియు టీమ్ సభ్యులకు వాలీ బాల్ కిట్లు పంపిణీ చేశారు. యువత క్రీడల్లో రాణించాలని గిరిజన జాతి ఖ్యాతి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. మొదట నుంచి జనసేన పార్టీ నాయకులుగా యువత ఆశ, ఆకాంక్షలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు పాంగి లక్ష్మణ్, కొర్ర రవి, సోబోయి రామారావు, పాంగి చిన్న మరియు క్రీడాకారులు డేవిడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment