కర్నూలు జిల్లా, మంత్రాలయ నియోజకవర్గం, కౌతాల మండలం, బదినెహాల్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ సందర్భంగా శుక్రవారం మంత్రాలయ జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షులు బి.లక్ష్మణ్ టోర్నమెంట్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, “క్రీడల వల్ల ఆరోగ్యం మెరుగవడమే కాకుండా, దేశానికి గౌరవం తీసుకురాగలము,” అంటూ క్రీడాకారులందరికీ “ఆల్ ది బెస్ట్” చెప్పారు. ఈ కార్యక్రమంలో బదినెహాల్ గ్రామ టీడీపీ సీనియర్ నాయకులు నరసింహులు, కోసగి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ.రెడ్డి, బీజేపీ నాయకులు రమేష్, స్కూల్ టీచర్ శేషాద్రి, చైర్మన్ షేక్షావలి, ఎరుకుల ఈరన్న, షబ్బీర్, పి.ఇ.టి. నరసింహరాజు, జనసేన నాయకులు చిన్న, కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది.
Share this content:
Post Comment