45వ డివిజన్లో సంకల్ప యాత్ర

  • ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి బడేటి చంటి
  • జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని ధ్వజమెత్తిన రెడ్డి అప్పలనాయుడు.

ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బడేటి చంటి ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. శనివారం 45వ డివిజన్ పరిధిలోని గోకుల్ టీవీఎస్ షో రూమ్ వద్ద నుండి సంకల్ప యాత్రను ప్రారంభించిన బడేటి చంటి ఏలూరు జనసేన ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు, టిడిపి నాయకులు మధ్యాహ్నపు బలరాం,కొట్టు మనోజ్ తో కలిసి నిర్వహించారు.. కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గత వైభవాన్ని తీసుకువచ్చేలా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. ఇంటింటికి తిరిగి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంకల్ప యాత్రలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు, బడేటి చంటి మాట్లాడుతూ అవినీతి లేని ప్రజాస్వామ్యం కావాలన్నా అవినీతి లేని అధికారులు రావాలన్నా ఈ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు.. సొంత కుటుంబాల మధ్య కలహాలు పెడుతున్న వైసీపీని ఈ ఎన్నికల్లో నామరూపాలు లేకుండా చేయాలని ఆయన కోరారు.. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పాదనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని అన్నారు.. విశ్వసనీయత నైతికత లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ రెడ్డి ఒకే ఒక్క ఛాన్స్ అనే పదం ప్రజలకు వందేళ్ళ తరువాత కూడా మర్చిపోలేని అతిపెద్ద ప్రతికూల అనుభవాన్ని మిగిల్చిందన్నారు.. ఈ ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుక పడడంతో పాటు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అనగడొక్కబడ్డారని, ఈ అయితే ఏందో ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన తరువాత 2024లో మరొక ఛాన్స్ అనే మాట వింటుంటే ప్రజల వెన్నుల్లో మనకు పుడుతుందన్నారు. నమ్మి ఒకసారి వైసీపీకి ఓటేస్తేనే రాష్ట్రం పరిస్థితి ఏంటోనని ఆలోచిస్తే సర్వత్ర వనికిపోతున్నారు. అధికారమే లక్ష్యంగా గత ఎన్నికల్లో జగన్ రెడ్డి అనేక రకాలుగా అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి, అరాచకం, విధ్వంసం, కబ్జాలు, దోపిడీలతో ప్రజల జీవితాలను బ్రష్టు పట్టించారని ఆస్తుల కల్పన గురించి కనీస ఆలోచన లేకుండా 13 లక్షల కోట్ల అప్పుల మూటను ప్రజలు నెత్తిన గుదిబండ లాగా తగిలించిన ఘనత జగన్ రెడ్డికే చెల్లిందని ఈ సందర్భంగా తెలియజేశారు.. రానున్న ఎన్నికల్లో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలని ఆయన డివిజన్ ప్రజలను కోరారు..మే 13వ తేదీన జరుగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి గారిని, పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గారిని గెలిపించాలని వారు కోరారు.. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం బిజెపి పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, కార్యదర్శి ఎట్రించి ధర్మేంద్ర, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, మీడియా ఇంచార్జీ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు, నాయకులు బోండా రాము నాయుడు, రెడ్డి గౌరీ శంకర్, వేముల బాలు, పవన్, ఎమ్.డి.ప్రసాద్, నిమ్మల రవి, జనపరెడ్డి తేజ ప్రవీణ్, కురెళ్ళ భాస్కర్, సాయి రామ్ సింగ్, వీర మహిళలు తుమ్మపాల ఉమా దుర్గ, కొసనం ప్రమీల, సుధా బత్తుల శ్రీదేవి, దుర్గా బి బి పలువురు నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో డివిజన్ ప్రజలు హాజరయ్యారు.