అర్తమూరులో 70 సంవత్స్రాల వృద్ధురాలపై వాలంటీర్ దాడి: ఎస్ వి బాబు

పెడన, బంటుమిల్లి మండలం, అర్తమూరు పంచాయతీ, సాయి నగర్లో నివాసం ఉంటున్న 70 సంవత్సరాల వృద్ధురాలిపై దాడి చేసిన వాలంటీర్ ప్రశాంత్, సాయి నగర్ కు చెందిన కొంతమంది వృద్ధులను పెడన నేతన్న నేస్తం సభకు తీసుకువెళ్ళిన వాలంటీర్. అందులో మాకాల సామ్రాజ్యం(70) అనే వృద్ధురాలు కూడా ఉంది. తనకు దాహంగా ఉంది అని మంచినీరు అడిగినందుకు వృద్ధురాలిపై దుర్భాషలాడాడు. వాలంటీర్ అంతటితో ఆగక మరుసటి రోజు సాయంత్రం ఇంటి నుండి సాయిబాబా గుడికి వెళ్తున్న సామ్రాజ్యంపై వాలంటీర్ ప్రశాంత్ మరియు అతని తండ్రి దారికాచి మమ్మల్ని మంచినిరు అడుగుతావా అని దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతేకాక నీకు సంక్షేమ పథకాలు కట్ చేస్తాం అని బెదిరింపులకు గురి చేశారని బాధిత వృద్ధురాలు వాపోయారు. వాలంటీర్ ప్రశాంత్ తండ్రి కూడా అదే గ్రామపంచాయతీలో వార్డు మెంబరు. ఈ దాడిని జనసేన పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే మరియు వైసీపీ స్థానిక నాయకుల అండ చూసుకొని వాలంటీర్లు అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. పెళ్లి దుస్తులతో లబ్ధిదారులకు పింఛన్ ఇస్తున్నట్లు, ఆసుపత్రిలో ఉన్న వృద్ధులకు పింఛన్ ఇస్తున్నట్లు ఫోటోలకు ఫోజులు ఇచ్చి వైసిపి సోషల్ మీడియాలో వైరల్ చేసుకునే వాలంటీర్లు ఒక వృద్ధురాలి దాహం తీర్చడానికి నీళ్లు ఇవ్వలేరా? మొన్న పెడనలో జరిగిన నేతన్న నేస్తం సభకి, పెన్షన్ దారులను మరియు వివిధ లబ్ధిదారులను బలవంతంగా తరలించవలసిన అవసరం ఏమిటి? మంత్రి జోగి రమేష్ తన స్వార్ధ రాజకీయాల కోసం పెడన నియోజవర్గ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. సభా నిర్వహణ లోపం వల్ల దేవరపల్లి గ్రామానికి చెందిన సమ్మెట రత్న మాణిక్యం అనే వృద్ధురాలు మృతి చెందింది. వైసిపి ప్రభుత్వం వాలంటీ వ్యవస్థను అడ్డంపెట్టుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటుంది. వృద్ధురాలిపై దాడి చేసిన ప్రశాంత్ అనే వాలంటీర్ కు వైసిపి ప్రభుత్వం వాలంటీర్ సేవారత్న, లేదా ఉత్తమ వాలంటీర్ అని అవార్డు ఇస్తారా? లేక అతనిపై చర్య తీసుకుంటారా? పోలీసు వారు జరిగిన సంఘటనపై న్యాయవిచరణ చేసి దాడి చేసిన వాలంటీర్ ప్రశాంత్ ని, అతని తండ్రి పై కేసు నమోదు చేయవలసిందిగా జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మాకాల సామ్రాజ్యం కుటుంబానికి జనసేన పార్టీ అండదండగా ఉంటుందని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.