ఎంప్లాయిమెంట్ సర్వే ముసుగులో ఓటర్ల వివరాలు అడుగుతున్న వాలంటీర్లు

  • ఎంప్లాయిమెంట్ సర్వే ముసుగులో గ్రామ వార్డు వాలంటీర్లు కొన్ని రోజులగా ఇంటింటికి వెళ్లి అడుగుతున్న ప్రశ్నలు
  • పట్టబద్రులు మీ ఇంట్లో ఉన్నారా…?
  • వాళ్ళు ఏం చేస్తున్నారు పట్టబద్రుల ఓటర్ల జాబితాలో వారు పేరు నమోదు చేసుకున్నారా…?
  • ఏ రాజకీయ పార్టీ పైన ఆసక్తి చూపిస్తున్నారు…? అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వివరాలన్నీ వాలంటీర్లు తెలుసుకోవలసిన అవసరం వారికి ఏంటి నిజంగా ఎంప్లాయిమెంట్ సర్వేనైతే పట్టభద్రుల రాజకీయ ఆసక్తిల గురించి ఎందుకు అడుగుతున్నారు. ఇది ఎన్నికల విధుల్లో వాలంటీర్లు భాగస్వామ్యం కాదా ఇంత జరుగుతున్న ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదు. రాజకీయ పార్టీల నుండి ఫిర్యాదులు అందినప్పుడల్లా వాలంటీర్లకు ఓటర్ నమోదు సహా ఏ విధమైన ఎన్నికల పనులను అప్పగించొద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం తప్ప వాటి అమలుకు ఎందుకు పట్టించుకోవట్లేదు వాటిని బే ఖాతరు చేస్తున్న వాలంటీర్లను విధులనుండి ఎందుకు తొలగించడం లేదు వారికి బాధ్యతలు అప్పగిస్తున్న అధికారులపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పట్టబద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి వైకాపా వైకాపా అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలి అని మంత్రులు వైకాపా ఎమ్మెల్యేలు సమావేశాలు పెట్టి మరీ చెబుతున్నారు ఇలా చెప్తుంటే కనీసం వారికి నోటీసులు అయినా ఎందుకు ఇవ్వట్లేదు అందుకే ఎన్నికల విధుల్లో వాలంటీర్లు వారికి ఆ బాధ్యతలు అప్పగిస్తున్న అధికారులు ఆదేశాలిస్తున్న వైకాపా ప్రజాప్రతినిధులు మరింతగా చెలరేగిపోతున్నారు. శాసనమండలిలో ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం కర్నూలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. వాటికి సంబంధించి ఓటర్ నమోదు ప్రక్రియ సాగుతోంది గ్రామ వార్డు వాలంటీర్లు కొన్ని రోజులగా పట్టుబద్రుల వివరాలు సేకరించడం వారి పేరుతో ఓటర్ నమోదు కోసం దరఖాస్తు నింపటం దరఖాస్తులన్నీ సేకరించి సంబంధిత అధికారులకు ఇవ్వడం వంటివి చేస్తున్నారు. వైకాపాకు అనుకూలమైన పేర్లు మాత్రమే ఓటర్ల జాబితాలో చేర్చి ప్రతిపక్ష పార్టీలకు మధ్య మద్దతు ఇచ్చే వారి పేర్లు చేర్చకుండా చూసేందుకే వాలంటీర్లను వినియోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎంప్లాయిమెంట్ సర్వే పేరుతో వాలంటీర్లు నిర్వహిస్తున్న సర్వే ఎన్నికలను ప్రభావితం చేయటమే అవుతుంది కావున ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.