ఆరికతోట గ్రామంలో ఓటర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమం

బొబ్బిలి నియోజకవర్గం: రామభద్రపురం మండలం, ఆరికతోట గ్రామంలో జనసేన నాయకులు కనకాల శ్యామ్ అల్లు రమేష్, టీడీపీ నాయకులు కూనిశెట్టి భాస్కరరావు ఆధ్వర్యంలో కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో 149, 150, 151 బూత్ లను సందర్శించి ప్రస్తుతం దాదాపు 3530 ఓట్లు ఉన్నట్లు నిర్ధారించారు. ఇందులో డెత్స్ దాదాపుగా 30 ఉన్నట్లుగా గుర్తిఒచి వాటిని తొలగించాలని బి.ఎల్.ఓని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పల్లా తరుణ్, పొందూరు సత్యనారాయణ వల్లూరు జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి యువత ఓటుతో సమాధానము చెప్పాలని.. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.