అగ్నిప్రమాద బాధితులకు మనోధైర్యాన్నిచ్చిన వి.ఆర్.పురం జనసేన

వి.ఆర్.పురం మండలంలోని కొటారుగొమ్ము గ్రామంలో ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైపోయిన ఇంటిని మరియు కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మండల నాయకులు పరామర్శించి, వారికి నిత్యావసర సరుకులు, దుప్పట్లు మరియు కొంత ఆర్దిక సహాయం చేయడం జరిగింది. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. పూర్తిగా నిర్వాసితులైన కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, నాయకులు కనుగుల శ్రీనివాస్ రెడ్డి, కోట్ల మోహన్ రెడ్డి, ముత్యాల నాగేంద్ర, పోషి రెడ్డి, నాగరాజు, రాజేంద్ర మరియు జనసైనికులు పాల్గొన్నారు.