మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉద్యోగస్తుల వేతనాలు వెంటనే చెల్లించాలి: గునుకుల కిషోర్

నెల్లూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కిషోర్ గునుకుల ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉద్యోగస్తుల వేతనాలు వెంటనే చెల్లించాలని సరైన ప్రణాళికలు లేక జగన్మోహన్ రెడ్డి కనీసం పనిచేసిన వారికి జీతాలు కూడా ఇవ్వలేకున్నారు. ఎట్టకేలకు నిన్న 04.05.2023 న మార్చి నెల జీతం ఇచ్చిన ప్రభుత్వం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నెల్లూరు జిల్లాలో 298 మంది ఉద్యోగస్తులు ఔట్సోర్సింగ్ నుంచి 120 మంది ఉద్యోగస్తులు దాదాపు రెండు నెలల నుంచి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. జీతాలు అడిగితే సమాధానం చెప్పడం సరేసరి మే నుంచి మీ కాంట్రాక్టు ముగిసింది, కొత్త అగ్రిమెంటు చేసుకుంటేనే జీతాలు వస్తాయి అనే సందిగ్ద పరిస్థితి. కాంట్రాక్టు రెన్యువల్ చేసుకోవడానికి అవసరమైన అగ్రిమెంట్లు ఇంతకీ అందజేయలేకపోవడంతో మే నెలలో కూడా తమకు జీతం రాదేమో అని భయం, ఉద్యోగస్తులు నిరాశపడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద దాదాపుగా 5000 మంది ఉద్యోగస్తులు దీనిపై ఆధారపడి ఉన్నారు.ఒక నెలలో జీతాలు ఆపితే 6 కోట్ల రూపాయలు అలా రెండు నెలల నుంచి ఆపడంతో 12 కోట్ల రూపాయల వేతనాన్ని బకాయిపడిన ఈ ప్రభుత్వం నిధులు లేక జీతాలు ఆపిందా..? లేక జీతాలు ఇవ్వాల్సిన నిధులు వేరే పథకాలకు ఏమైనా మళ్ళించారా అనేది శ్వేతపత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్ట్ టైం ఉద్యోగస్తుల్ని అలాగే ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని మాటిచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి కనీసం జీతాలు ఇవ్వకుండా వారి జీవితాలను వీధిలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు తగిన సమయానికి జీతాలు అందట్లేదని బ్యాంకులో వారు ఈఎంఐ డేట్లు మార్చాలని వినతులు ఇచ్చిన పరిస్థితి అందరికి తెలిసిన సంగతే. సరైన ప్రణాళికలు లేకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఈ వైసిపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ విషయంపై పిడిని, కలెక్టర్ ని కలుస్తాం వెంటనే చర్యలు తీసుకొని ఇది పబ్లిక్ ఇష్యూ, జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోమని కోరుతామని కానిపక్షంలో ఇది పబ్లిక్ ఇష్యూ దీనికి సంబంధిత అధికారులను బధ్యులను చేసి పనిచేసిన వారికి వేతనం అందే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.