గుడ్ మార్నింగ్ సీఎం సార్: హుకుంపేట జనసేన
అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం జనసేన పార్టీ మండల నాయకులు బలిజ కోటేశ్వరరావు, పడాల్ ఆద్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమం చేయడమైనది. హుకుంపేట నుండి తీగలవలస వరకు గల ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయినా పట్టించుకోలేని ప్రభుత్వాలు మేల్కొలిపే విధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వంతాల మోహన్, పరదాని సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-16-at-5.02.46-PM-1024x461.jpeg)