టెక్కలి టీం పిడికిలి ఆధ్వర్యంలో గోడపత్రిక ఆవిష్కరణ

టెక్కలి, భారతదేశంలో అనేకమంది వృత్తిని నమ్ముకున్న కార్మికుల్లో అన్నం పెట్టే రైతులు మరియు కౌలు రైతులు. చేతికి వచ్చే పంట వివిధ రూపంలో తుపాన్ వలన, వర్షాలు లేక..నాణ్యత లేని విత్తనాలు, నాణ్యత లేని ఎరువుల వలన, అప్పు చేసి వ్యవసాయం చేసిన రైతు పండించిన పంటలు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొవటం వలన కౌలు రైతు కుటుంబాలు రోడ్డున పడ్డారు.. దేశంలోనే ఏ రాజకీయ పార్టీలు కూడా చేయలేని సహాయం 30 కోట్ల రూపాయలతో 3000 మందికి రైతు భరోసా క్రింద ఒక్కో కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి నమస్కారాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నారై టీం పిడికిలి మైలవరపు రాజా సౌజన్యంతో గురువారం టెక్కలి పట్టణపరిధిలో పలు ఆటోలకు మరియు వివిధ పబ్లిక్ ప్రదేశాలలో గోడపత్రికలు అంటించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా టీం పిడికిలి కో ఆర్డినేటర్ టెక్కలి జనసేనపార్టీ సీనియర్ నాయకులు కూరకుల యాదవ్, టెక్కలి టీం పిడికిలి ఇంచార్జ్ ఎంపీటీసీ అభ్యర్థి రాయి సునీల్, అవినాష్ ప్రసాద్, పసుపురెడ్డి సోమేశ్, తోట శ్యాం కార్యకర్తలు పాల్గొన్నారు.