జనసేన హామీలతో గోడపత్రిక

రాజాం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 9వ ఆవిర్భావ సభ రోజు ఇచ్చిన హామీలను సోమవారం రాజాం నియోజకవర్గంలో, జనసేన నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో, జనసైనికుల సమక్షంలోని గోడ పత్రిక రూపంలో ఆవిష్కరించటం జరిగింది. ఈ రకంగా రాజాం నియోజకవర్గం మొత్తం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా ప్రయత్నం ఎన్ని రాజు తన ప్రయత్నం త్రికరణ శుద్ధితో చేస్తున్నారు. ఈ క్రింది హామీలను గోడ పత్రికలో ప్రచురించడం జరిగింది.

*జనసేన పార్టీ అధికారంలోకి రాగానే బలమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తాం. విశాఖ, విజయవాడ నగరాలను హైటెక్ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అభ్యుదయ రాజధానిగా రూపొందిస్తాం.
*కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతాం. రాయలసీమలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం.
*తెల్ల రేషన్ కార్డు దారులందరికీ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తాం.
*వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. పంట కాల్వలు నిర్మిస్తాం.
*జనసేన పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను తీరుస్తాం. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యగ అవకాశాలు కల్పిస్తాం. సులభ్ కాంప్లెక్సుల్లో పని చేసే ఉద్యోగాలు కాకుండా మీ కాళ్ల మీద మీరు నిలబడగలిగేలా ఉపాధి కల్పించి వారికి ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలు అందిస్తాం.
*ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకువస్తాం.