*రెడ్డి అప్పల నాయుడు, గోవిందరావు (చినబాబు) ఆధ్వర్యంలో జనసేన నేతల ఘన ఆతిథ్యం..
దెందులూరు, నియోజకవర్గంలోని పెదవేగి మండలంలో ఉన్న ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించేందుకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు (చినబాబు)తో కలిసి స్వాగతం పలికారు. అయిల్ పామ్ పరిశోధన కేంద్రంలో ప్రొఫెసర్లతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని ఆయిల్ పామ్ సాగు, పరిశోధనల ప్రాధాన్యత, అభివృద్ధి మార్గాలు గురించి మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, నాయకులు నారా శేషు, కొఠారు ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. కూటమి పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మంత్రికి ఆత్మీయ స్వాగతం పలికారు.

Share this content:
Post Comment