ఆంధ్రప్రదేశ్ లో అధికార దుర్వినియోగం..

అధికారం అనేది అత్యంత బాధ్యతతో వ్యవహరించాల్సిన ఒక స్థానం. అంతేగానీ మాకు అధికారం వచ్చింది మేము బరితెగించి ఏదైనా మాట్లాడతాం అనుకోకూడదు. ప్రతిపక్షం ఒక వేళ హద్దు దాటి ప్రవర్తించినా అధికార పక్షం తన పరిధిని ఎప్పుడూ దాటకూడదు.

మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది పూర్తిగా వ్యతిరేఖంగా జరుగుతుంది. పెద్దల సభకు రెండవ సారి ఎన్నికైన మన ప్రజా ప్రతినిధుల భాష చూస్తుంటే ఎంత హుందాగా ఉందో ఇక్కడ, ప్రతిపక్షం హద్దు దాటింది వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకోండి అంతే కానీ మీరు ఇంకా దిగజారి మాట్లాడతారా?..

గౌరవ సుప్రీం కోర్టు ట్రాన్స్ జెండర్స్ విషయంలో తీర్పు ఇస్తూ వారిని అగౌరవ పర్చవద్దు అని తేటతెల్లంగా చెప్పింది. రాజ్య సభ ఎంపీ అయి ఉండి ఎంపీ సర్ ఆ భాష, వారి గురించి ఆ పద ప్రయోగం ఏంటి అసహ్యంగా రాబోయే తరాల వారికి ఏమీ చెప్పదలచుకున్నారు. అయ్యా! జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడూ “నేను విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయం చేస్తాను” అని మా చెవిలో జోరీగ లా అంటూ ఉంటారు, మీ రాజ్య సభ ఎంపీ, మీ కార్యకర్తలు బరితెగించి బూతులు, ఆడవారి మీద దాడులు చేస్తుంటే మీరు ఆనందిస్తూ అవే విలువలు అనుకుంటున్నారా? మీ ఎంపీలు మంత్రులు, నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షాలను, రేప్ బాధితులను అవమానించారు, చివరకు ట్రాన్స్ జెండర్స్ ను కూడా వదలకుండా అవమానిస్తున్నారు. అసహ్యమైన భాష ను వాడుతున్న ఎంపీలను, మంత్రులను, కార్యకర్తలను జగన్ గారు కట్టడి చేయాలి అని జనసేన పార్టీ తరపున జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ జేశారు.