జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో నీటి పంపిణీ

బెలుగుప్ప మండలం, నరసాపురం గొల్లలదొడ్డి గ్రామంలో గత ఇరబై రోజులుగా నీలకంటపురం శ్రీ రామిరెడ్డి నీరు రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఊరి జాతర సందర్భంగా మరింత ఇబ్బందిగా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల దృష్టికి రావడంతో వెంటనే ఇరు పార్టీలు స్పందించి నీటి టాంకర్ ద్వారా దాదాపు పదివేల లీటర్ల నీటిని గొల్లలదొడ్డి గ్రామ ప్రజలకు సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్, నాని, తిప్పయ్య, రవికుమార్ నాయక్, మురళి మోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రవీణ్ నాయక్, అవినాశ్ తేజ, హనుమంతు నాయక్ మరియు ఇరుపార్టీల నాయకులు పాల్గొన్నారు.