ఈదరాడ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పటుచేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా ఆదివారం మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో జనసేన పార్టీని బలోపేతం చేసే ఆలోచనతో జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ఈదరాడ గ్రామంలో పలు ప్రాంతాల్లో జనసైనికులు తాగునీరు సరఫరా చేసారు. ఈదరాడ గ్రామ పరిధి సిధార్థ పేట, కల్లింగులపేట, కంచివారి మెరక, చాకిరాయి చెరువుగట్టు మరియు కాలనీలో గత కొన్నిరోజులనుంచి మంచినీరు ఏద్ధడి అధికంగా వుండటంతో ప్రజల ఇబ్బంది దృష్ట్యా జనసేన పార్టీ నేనున్నాను అని మరియొకసారి వారి ముంగిట నిలిచింది. జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటిఇంటికి ఉచిత నీరు పంపిణి చేసారు. గ్రామప్రజలు జనసైనికులను అభినందించారు. ఈ కార్యక్రమం ఈదరాడ జనసైనికుడు యెరుబండి చిన్ని ట్రాక్టర్ డిజల్ ఖర్చులకు ఆర్ధికసాయం చేయగా ఈదరాడ జనసైనికుల వీరమహిళల ద్వారా త్రాగునీరు అందించడం జరిగింది.