వేములవాడ గ్రామంలో జనం కోసం పవన్-పవన్ కోసం మనం

కాకినాడ: జనం కోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా గురువారం కరప మండలం వేములవాడ గ్రామంలో స్థానిక నాయకులు మిరియాల రాంబాబు, కృపదానం, మహేష్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలు తెలుకోవడానికి ఇంటిఒఇంటికి వెళుతున్న జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.. గ్రామంలో మహిళలు, ప్రజలు అనేక సమస్యలు తెలిపారు. 100 కుటుంబాలు నివసించే ఈబీసీ కాలనీకి డ్రైనేజీ వేశారు కానీ, నీరు పోయే మార్గం సరిగా లేదని, ప్రభుత్వం ఇచ్చిన స్థలం లో గృహాలు కట్టుకున్న వారికీ విద్యుత్ సౌకర్యం లేదని, ఎన్ని సార్లు అర్జీలు పెట్టిన అధికారులు స్పందించడం లేదని,
మెయిన్ డ్రైనేజీ లేకపోవడం వలన డ్రైనేజీ ల నుండి వచ్చేనీరు పంట కాలువలోకి వెళ్లిపోవడం వలన పంటలు పూర్తిగా పాడై పోతున్నాయని, రైతు అప్పుల పాలు అవుతున్నారని, పంట నీరు కొరత వలన రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని గ్రామంలో వీధి దీపాలు సరిగా పని చేయడం లేదు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం. గ్రామంలో సరైన రోడ్లు లేవు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. స్మశానం లో మౌలిక సదుపాయాలు లేవు. ఆర్ బి కే సెంటర్ ఉన్న రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని, గ్రామంలో జరిగిన భూ రీసర్వే తరువాత జగన్ ఫోటోతో వచ్చిన పాస్ బుక్స్ 90% తప్పులతో వచ్చాయి అని నానాజీగారికి తెలిపారు. విటన్నిటిపై అధికారులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేసి త్వరతగతిన పనులు అయ్యేలా వత్తిడి తీసుకువస్తామని అలా కానీ పక్షంలో జనసేన ప్రభుత్వం వచ్చాక పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.