పెదకొత్తూరులో జనంకోసం పవన్-పవన్ కోసం మనం

కాకినాడ రూరల్, కరప మండలం, పెదకొత్తూరు గ్రామంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు అల్లు గంగాద్రి ఆధ్వర్యంలో జనంకోసం పవన్-పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఉన్న జనసేన పార్టీ పిఏసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ. పెద్దకొత్తూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది. మంచి నీరు వచ్చే సమయం సరిగాలేదు. శ్మశానంలో సరైన సదుపాయాలు లేవు. వర్షం వస్తే దహన సంస్కారాలు చేయటంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైసు మిల్లుల పొల్యూషన్ వలన మంచి నీళ్ళుతాగే నుయ్యి మొత్తం పాడయి పోయింది. ఆర్బికేల ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఆర్బికే సెంటర్లు వైసిపి కార్యాలయాలగా మారిపోయాయి. వైసిపి గ్రామ కన్వీనర్లు ధాన్యం కొనుగోలు చేసే కమిషన్ ఏజంట్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్షం కారణంగా వరికి బదులుగా సన్నాలుగా ఈ క్రాప్స్ నమోదు చేయడంతో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. వారి పొలాల నుండి ఆర్బికే సెంటర్ కి ధాన్యాన్ని తరలించేందకు రవాణా ఖర్చులు చెల్లించడం లేదు. తడిసిన ధాన్య, మొక్కలు వచ్చిన ధాన్యం విషయంలో రైతులకు సరైన న్యాయం చేయాలని, గిట్టిబాటు ధర కల్పించాలి. డ్వాక్రా మహిళలు రుణాలు మంజూరు కాలేదు. బటన్ రెడ్డి బటన్ నొక్కి 45 రోజులు దాటిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.