యుద్ధానికి మేము సిద్ధమే

కాకినాడ సిటి, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో స్థానిక 8వ డివిజన్, సాంబ మూర్తి నగర్, ఇందిరా కాలని, రాజీవ్ గృహ కల్ప వద్ద కొమ్మన సూర్య ప్రకాష్, బడిగంటి సురేష్ ఆధ్వర్యంలో మన కాకినాడలోనే కావాలి మన నివాసానికి ఇళ్ళ కోసం యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ ముందుగా అక్కడి మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు. తరువాత ఆయన మాట్లాడుతూ శాసనసభ్యులు ద్వారంపూడి స్థానిక ప్రజలను యు.కొత్తపల్లి తీసుకెళ్ళి ఇక్కడ లే-అవుటులో మీకు ఇళ్ళు ఇచ్చేసామని, కొమరిగిరి తీసుకెళ్ళి అక్కడ పట్టాలిచ్చానని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారనీ, అరవై నెలల అధికారాన్ని చెతిలో పెట్టుకుని మొదలుపెట్టి ఉంటే ఈపాటికి ఎప్పుడో గృహప్రవేశాకు కూడా అయ్పోయేవి కాదా మరి ఎన్నికలు నెలరోజులు పెట్టుకుని ఇప్పుడు చెప్పడం ద్రోహం కాదా అన్నారు. ఇప్పుడు సుమారు ముప్పైవేలమందికి ఇళ్ళు ఇచ్చానని చెప్పడం చుస్తుంటే ఎప్పటికి పూర్తీవుతాయనీ ఇదంతా చిత్తశుద్దిగా చేసినది కాదని దుయ్యబట్టారు. దీనికి తోడు నగరంలో పుట్టి పెరిగి జీవిస్తున్న వాళ్ళను నగరబహిష్కరణ చేసి వేరే గ్రామంలో ఇవ్వడం ఏంటని నిలదీసారు. మిమ్మల్ని తీసుకెళ్ళి వెరే ప్రాంతంలో బతకమని పంపితే అపుడు మీకు వీరి బాధ తెలుస్తుందనీ, సాయం చేస్తున్న నెపంతో పేదలను ఇలా చిన్న చూపు చూడటాన్ని జనసేనపార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోగడ పదిహేను సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోని వారికి సుమారు రెండువందలమందికి ఇక్కడ ఇళ్ళు ఇవ్వడం జరిగిందనీ, ఇప్పుదు వారు వారి పిల్లలు ఇలా కుటుంబాలు పెరిగాయనీ, వీరు ఇరుకిరుకుగా సర్దుకోవాలిసి వస్తోందనీ, వీరందరికీ తమ జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో నగరంలోనే ఇళ్ళు ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ ఉఫాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, సిటీ జనరల్ సెక్రెటరీ రమణారెడ్డి, అడపా మాధవ, ధనశేఖర్, ఉషాదేవి, సిహెచ్. త్రిమూర్తులు, అద్దంకి బాబి తదితరులు పాల్గొన్నారు.