దళితుల సంక్షేమ పధకాలని తీసేసిన జగన్ రెడ్డిపై యుద్ధానికి మేము సిద్ధం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో డివిజన్ అధ్యక్షుడు పచ్చిపాల కోడి శ్రీను ఆధ్వర్యంలో 6వ డివిజన్ రేచర్లపేట హనుమాన్ ఆలయం ప్రాంతంలో దళితుల సంక్షేమ పధకాలని తీసేసిన జగన్మోహన్ రెడ్డిపై యుద్ధానికి మేము సిద్ధం అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ ఈఅయిదేళ్ళ వై.సి.పి పాలనలో దళితుల 27 సంక్ష్యేమపధకాలని తీసివేసారనీ, అంటే సరాసరి ఒక్కో సంవత్సరానికీ అయిదేసి పధకాలని అటకెక్కించారన్నారు. శిశుపాలుడు వొంద తప్పులు చేసినదాన్నిబట్టి చూస్తే ఒక్క దళితుల విషయంలోనే 27 తప్పులు ఈ జగన్మోహన్ రెడ్డి చేసాడనీ మొత్తమన్నీ చూస్తే వొంద పూర్తి అయ్యాయనీ అందుకే ప్రజలు నీ అవినీతి అరాచక ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం అంటున్నారన్నారు. మాట్లాడితే నా ఎస్.సి, నా ఎస్.టీ అని కపట ప్రేమని ఒలకబోసే నీకు ఈ దళితముద్దుబిడ్డలున్న రేచర్లపేట నుండీ మాహక్కులు కాలరాస్తూ, మాజీవితాలని నాశనంచేసావు జగన్మోహన్ రెడ్డి నీప్రభుత్వాన్ని దించడానికి సిద్ధం అంటున్నారని స్పష్టం చేసారు. ఒకనాడు ఎంతో అభిమానంగా పిఠాపురం మహరాజా ఇచ్చిన భూమిని కూడా కబ్జాలు చేస్తున్నారనీ, దళితులతో గృహప్రవేశాలు చేయించని ద్వారంపూడికి ఇవే అధికారానికి ఆఖరి రోజులన్నారు. ఈ 21 రోజులూ ప్రజలు, జనసైనికులు కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని అంతం చేయడానికి పోరాటం చేయాలన్నారు. రాబోయే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రజా ప్రభుత్వంలో మెరుగైన పాలన పొందుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిటీ సహాయ కార్యదర్శి కాంటా రవిశంకర్, చింతకాయల చిన్ని, బంగారు శ్రీను, పచ్చిపాల మధు, చిన్న అంజి, వరప్రసాద్, ప్రశాంత్, బద్రి, శ్యాం, సచిన్ తదితరులు పాల్గొన్నారు.