జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే

  • మన కాకినాడ పోర్ట్ – మన పని హక్కు

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో వాసంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో దూది మిల్లు ప్రాంతంలో మన కాకినాడ పోర్ట్ మన పని హక్కు కోసం ఈ జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి మేము సిద్ధమే అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముత్తా శశిధర్ మాట్లాడుతూ కాకినాద పోర్ట్ సహజసిద్ధంగా ఏర్పడినది అని, దీనిమీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు తరతరాలుగా జీవిస్తున్నాయన్నారు. మరి అలాంటిది నేడు ఈ వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా ఇక్కడ కొత్తగా అభివృద్ధి జరగడం అటుంచి, ఉన్నది కూడా నాశనమైపొతోందన్నారు. స్థానికులకి ఉపాధి పనులు ఇప్పించడంలో తీవ్రంగా విఫలమైందనీ, స్థానికుల లారీలకు అవకాశం ఇవ్వకుండా బయటవారికి ఇస్తున్నారనీ ఇది తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక్కడివారికి పని ఇవ్వడం ఈప్రభుత్వ బాధ్యత అనీ దానిని ఈప్రభుత్వం స్వార్ధ ప్రయోజనాలకోశం తుంగలోకి తొక్కుతోందని విమర్శించారు. జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వంలో స్థానికుల పని హక్కుని అమలుచేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాధనాల లోవరాజు, బర్రె అప్పారావు, సత్తిబాబు, దాసరి సత్యనారాయణ, దుర్గాని కిషోర్, పంతాడి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.