మానసిక ప్రవర్తన మీద మాకు అనుమానం కలుగుతుంది: కుంటిమద్ది జయరాం రెడ్డి

పిఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా అద్భుతమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. మరి “కార్పొరేటర్ స్థాయి కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థాయి కంటే తక్కువ” ఎలా అవుతారో రాష్ట్ర ప్రజలకు వివరించగలరా? వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు.. అంటూ అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఎద్దేవా చేసారు. కేవలం పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తేనే నన్ను రాష్ట్ర ప్రజలు గుర్తింపునిస్తారనే స్థాయికి దిగజారి మాటలు మాట్లాడుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మీ మానసిక ప్రవర్తన మీద మాకు అనుమానం కలుగుతుంది. ఎమ్మెల్యేగా గెలుపొంది మీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బాధ్యత మరిచి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కుంటి సాకులు చెబుతూ, అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా, దొంగ చాటుగా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా మీ మాయ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మరు అని తెలుసుకోండి. మీ పాలనలో 2019 నుంచి 2024 వరకు సంక్షేమ పథకాలను భూతద్దంలో చూపుతూ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించి, సక్కగా బటన్ నొక్కుతున్నానని రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెప్పుతూ అభూత కల్పన కల్పిస్తూ రాష్ట్ర సంపదని, పకృతి వనరులను విధ్వంసం చేసి పకృతి సంపదను, ప్రజల సంపదని దోచుకుంటూ, దౌర్జన్యాలు, విధ్వంసాలు, దోపిడీలు, కబ్జాలు చేస్తూ ఆర్థిక విధ్వంసానికి రాష్ట్రాన్ని గురిచేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ సాధ్యమైనంత త్వరగా నెరవేర్చే క్రమంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను పురోగఅభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సభంజసం జగన్మోహన్ రెడ్డి. ఇక నీ మాయ మాటలు కల్లబొల్లి వేషాలు రాష్ట్ర ప్రజలు నమ్మరని తెలుసుకోండి. ఇప్పటికైనా సత్ప్రవర్తలతో మెలగండని హితవు పలికారు.

Share this content:

Post Comment